అవ్వతాతల ముఖాల్లో చిరునవ్వే చంద్రబాబు లక్ష్యం

రాయచోటి, ఫిబ్రవరి 28: అవ్వతాతల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాషా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10,000, దీర్ఘకాలిక రోగులకు రూ.15,000 పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు.
రాష్ట్ర పార్టీ ఆదేశాలు మరియు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రతినెలా రూ.2,800 కోట్లు, గత 18 నెలల్లో రూ.51 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అందించినట్లు వివరించారు. ప్రతి ఇంటిలో చంద్రబాబు నాయుడు గారిని పెద్దదిక్కుగా భావిస్తూ దీవెనలు అందిస్తున్నారని గాజుల ఖాదర్బాషా తెలిపారు. గత ప్రభుత్వంలో తగిన విధంగా పెన్షన్లు అందలేదని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వంలో పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp