సర్వమత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్

రాయచోటి, మార్చి 23 : ఇఫ్తార్ విందు సర్వ మత సామరస్యాన్ని పరిమళింపజేస్తాయని రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని 28వ వార్డు భట్టు వీదిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాను ప్రార్థిస్తూ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యమన్నారు. మనిషి సత్ప్రవర్తనతో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయని సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

Facebook
X
LinkedIn
WhatsApp