సిద్ధవటం : అకాల గాలి వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలకు నష్టపరిహారం అందించి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడుతుందనీ రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం సిద్ధవటం మండలంలో మండుటెండలో పర్యటిస్తూ భాకరాపేట దగ్గర దెబ్బతిన్న అరటి తోటలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిధని, రైతులకు అందించే నష్టపరిహారం ప్రభుత్వాదేశాల ప్రకారం అందుతుందని, అలాగే ఇన్సూరెన్స్ కూడా త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, భాకరాపేట సర్పంచ్ ప్రతాప్ నాయుడు, కాడే శ్రీనివాసులు నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిధి నాగనరసింహారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దశరథ నాయుడు, కరెంట్ రమణ, పుత్త బాబు, వెంకటరమణ, రామానాయుడు, నరసింహనాయుడు, నగేష్, అగ్రికల్చర్ ఏవో రమేష్ రెడ్డి, సందీప్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
