అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ఎస్ ఎన్ కాలనీకి చెందిన గర్భిణీ స్త్రీకి A+ రక్తము అత్యవసరమని డాక్టర్స్ పేషెంట్ వారికి తెలియజేయగా వారు హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ సొసైటీ చైర్మన్ వ్యవస్థాపకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ని సంప్రదించగా రాయల్ బేకరీ యాజమాన్యం అహమ్మద్, అర్షద్ చే శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేశారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయొచ్చని మైనుద్దీన్ సూచించారు. రక్తదానం చేస్తే నీరసంగా ఉంటారనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రాయల్ బేకరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి యువత, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 15