వేంపల్లె : మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ బి.చక్రపాణిరెడ్డి వెల్లడించారు. జూలై 20, ఆదివారం ఉదయం స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి వారి సౌజన్యంతో కీళ్లు, ఎముకలు, నరాలు, ఊపిరి తిత్తులు, చెవి, ముక్కు, టైఫాయిడ్, మలేరియా స్త్రీ సంబంధిత వ్యాధులు, యూరాలజీ తదితర సంబంధిత ఆరోగ్య సమస్యలపై ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మరిన్ని వివరాలకు 9494577620, 9502485242 నెంబర్ లకు సంప్రదించాలని కోరారు.
Post Views: 1