మనం సేవా సంస్థ సేవలు అమోఘం

రాయచోటి : రాయచోటి పట్టణంలోని మనం సామాజిక సేవా సంస్థ వారు చేస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మనం సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 3, ఆక్సిజన్ అంబులెన్సులు, ఒక ఐసీయూ వెంటిలేటర్ అంబులెన్స్, 2, రధాలు, 8 ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మనం సామాజిక సేవా సంస్థ వారు రాయచోటి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజులలో మనం సేవా సంస్థ వారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp