కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

రాయచోటి : రాయచోటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని టిడిపి నాయకులు మౌర్యరెడ్డి పేర్కొన్నారు. మే డే సందర్భంగా మౌర్య రెడ్డి రాయచోటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో రాయచోటి మునిసిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. మరమ్మతులకు గురైన చెత్త రిక్షాలను వెంటనే రిపేరు చేస్తామని కార్మికులకు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో టిడిపి నాయకులు మౌర్య రెడ్డి కార్మికులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp