రాయచోటి : అన్నమయ్య జిల్లా, రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాయచోటి అర్బన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ జహీర్ రాష్ట్ర రవాణా,యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచడంతోపాటు,పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుని సమస్యను సత్వరం పరిష్కరించుటలో వీరి సేవలు అమోఘం. ఈ సందర్భంగా ఎస్సై అబ్దుల్ జహీర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సమక్షంలో ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
Post Views: 1